కోదాడ,డిసెంబర్ 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నాటి కేసీఆర్ ప్రభుత్వ సకల కుటుంబ సర్వే లాగానే నేటి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం వల్ల ప్రజలకు ఓరిగేదేమి ఉండదని,ఇదొక కాలయాపన (టైమ్ పాస్) ప్రయత్నమని తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభయ హస్తం ఆరు గ్యారంటీల అమలు దరఖాస్తులలో పొందు పర్చాల్సిన అంశాలల్లోనే ఎన్నో అనుమానాలున్నాయని చెప్పారు.రేషన్ కార్డు నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్ లేకుండా సంక్షేమ పధకాల మంజూరుకు దరఖాస్తులు తీసుకొని లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారని అన్నారు.గ్రామపంచాయితీ,మున్సిపాలిటీ,రెవిన్యూ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో నెలల తరబడి తిరిగినా సాధారణ పనులు సైతం కావని అలాంటిది ఇన్ని లక్షల దరఖాస్తుల్ని పరిశీలించి, లబ్దిదారుల్ని ఎంపిక చేసి సంక్షేమ పధకాల్ని అందించేదెప్పుడని ప్రశ్నించారు.ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా సరిపడా సిబ్బంది లేరని,సగం పోస్ట్ లు ఖాళీగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.తొందర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఆతరువాత పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయని ఎలెక్షన్ కోడ్ పేరుతో ఈ ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కన పడేయటం ఖాయమని జోష్యం చెప్పారు.ఎన్నో ఆశలతో,ఎంతో నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని,ఇలాంటి జిమ్మిక్కులు మాని చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రజాపాలన కార్యక్రమంతో కాలయాపనకు ప్రయత్నం:కొల్లు
RELATED ARTICLES



