Saturday, July 5, 2025
[t4b-ticker]

ప్రజారోగ్యం మెరుగునకు పశువైద్యమే మేలు.

ప్రజారోగ్యం మెరుగునకు పశువైద్యమే మేలు.

:పశువులు బాగుంటేనే ప్రజలు బాగుంటారు.

Mbmtelugunews//కోదాడ,నవంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్)నూటికి 98.7 శాతం ప్రజలు పశు ఉత్పత్తులైన పాలు,గుడ్లు,మాంసం,మజ్జిగ,పెరుగు,స్వీట్స్ మొదలగు వివిధరూపాల్లో ఆహారంగా తీసుకుంటున్నారు.పశు ఉత్పత్తుల్ని ఆహారంగా తీసుకునే మన ఆరోగ్యం బాగుండాలి అంటే ముందు సమయానికి పశువులకి వ్యాధినిరోధక టీకాలు వేయిస్తూ పశువుల్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.కోదాడ మున్సిపాలిటీ కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో ఒకరోజు సామూహిక గాలికుంటు టీకా ప్రారంభ కార్యక్రమములో మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీలా రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పశువైద్యుల నెలరోజుల విలువైన సేవలు సమయం ఖర్చులు ఆదా చేసిన ఒకరోజు టీకా ఎంతో ప్రశంసనీయం అని అన్నారు.దేశంలో పశువులకు అత్యంత ఆర్ధిక నష్టం కలిగించే గాలికుంటు వ్యాధిని సమూలంగా నివారించి పశుపోషకులని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆరునెలలకి ఒకమారు ప్రభుత్వం నిర్వహిస్తున్న గాలికుంటు టీకా రోజుల తరబడి నిర్వహించడం వలన అన్నిరోజులు పశువైద్యశాలలలో వైద్యసేవలకు అంతరాయం,అన్ని పశువులను కవర్ చేయలేకపోవడం వలన టీకాల పనితీరు మీద ప్రభావం చూపేది కానీ మున్సిపాలిటీలోని 35 వార్డుల్లో ఏకకాలంలో ఒకేరోజు పల్స్ పోలియో తరహాలో టీముకి ఒక్కంటికి 100 పశువుల టీకా లక్ష్యం,పక్కా ప్రణాళికతో నిర్వహించిన ఈ ఒక్కరోజు గాలికుంటు టీకా కార్యక్రమం పశువులకు ప్రజలకి ఎంతో మేలు చేస్తుందని పశువైద్యుల విలువైన సేవలు సదా పశువైద్యశాలల్లో అందుబాటులో ఉంటాయని నెలరోజుల ఖర్చులు సైతం ప్రభుత్వానికి మిగులుతాయని ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య ని అభినందిస్తున్నానని అన్నారు.

మొత్తం 3500 ఆవులు గేదెలు ఉన్న మున్సిపాలిటీలో శుక్రవారం 3200 పశువులకి టీకాలు వేయడం జరిగిందని వివిదకారణాలతో అందుబాటులో లేని మిగిలిన 300 పశువులకు సైతం రేపు టీకాలు వేయిస్తామని తెలిపారు.నియోజక వర్గంలో రెఫరల్ పశువైద్యశాలగా ఉన్న కోదాడ ప్రాంతీయ పశువైద్య శాల శిథిల భవనం పరిశీలించి శాసన సభ్యుల వారి దృష్టికి తీసుకెళ్లి బిల్డింగ్ ఆపరేషన్ థియేటర్,లాబొరేటరీ,క్స్ రే,స్కానింగ్,శిక్షణా హాలు,రైతులకోసం వెయింగ్ హాలు తదితర సమస్త సౌకర్యాలతో నూతన పక్కా భవనానికి ఒక కోటి పది లక్షల బడ్జెట్ మంజూరీకి ప్రయత్నిస్తానని భవిష్యత్లో పశుపోషకులకు ఆధునిక సాంకేతిక వైద్యసేవలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.ప్రాంతీయపశువైద్యశాలలో దేశం లోనే తొలిసారిగా నూతనంగా ఏర్పాటు చేసిన పశు ఔషధ బ్యాంక్ సేవలను అభినందిస్తూ ఉచిత మందులను పశుపోషకులకు పంపిణీ చేశారు.వైద్యశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమాచార బోర్డులు సందర్శకులకు ఎంతగానో ఉపయోగమనీ,దైనందిన పశిపోషణలో విలువైన మెలకువల సమాచారం ఇక్కడ అత్యంత సుందరంగా అందుబాటులో ఉందనీఇతరప్రాంతాల్లో సైతం ఇలాంటి సమాచారం అందుబాటులో ఏర్పాటుచేస్తే పశుపోషకులకు అత్యంత లాభదాయకమని
పశుపోషకుల మేలుకొరకు అత్యంత వ్యయప్రయాసకోర్చి, అంకితభావంతో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య సేవలు మరింతగా పట్టణం ఉపయోగించుకుంటూ పశుపోషణ లాభసాటితో ఆర్ధిక పరిపుష్టి సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమములో 30 వ వార్డు కౌన్సిలర్ పెండెం వెంకటేశ్వర్లు,చిలుకూరు,కోదాడ,హుజూర్ నగర్,మునగాల మండల పశువైద్యాధికారులు డా కె వీరారెడ్డి,డా,,డి శ్రీనివాస్,డా,,బి మమత,డా,,బి మధు,శ్రీనివాస్ రెడ్డి,సిబ్బంది సాయికృష,ఖాన్,చిరంజీవి,రాజు,గోపాల మిత్రలు,మైత్రిలు,వాక్సినేటర్స్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular