కోదాడ,మార్చి 15(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని కోదాడ ఆర్డిఓ సిహెచ్ సూర్యనారాయణ అన్నారు.శుక్రవారం కోదాడ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ఓటు హక్కు నమోదు పై అవగాహన కల్పించి మాట్లాడారు.18 సంవత్సరాలు దాటిన యువతి యువకులు విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు.ఓటు హక్కు నమోదు పై విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు.విద్యావంతులు ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగ ఫలాలను తెలుసుకోవాలన్నారు.కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన.ఈ కార్యక్రమంలో కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్,అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్ చంద్రశేఖర్,రమేష్,ప్రిన్సిపాల్ గాంధీ,డిప్యూటీ తాసిల్దార్ అనిల్ కుమార్,అకడమిక్ డైరెక్టర్ పోతుగంటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం… ఆర్డీవో సూర్యనారాయణ
RELATED ARTICLES



