ప్రజా పంపిణీ బియ్యాన్ని లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలి:డీఎస్పీ శ్రీధర్ రెడ్డి,ఆర్డీవో సూర్యనారాయణ
కోదాడ,జులై 11(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పిడిఎస్ రైస్ అక్రమ రవాణా నిరోధించేందుకు కోదాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చౌక ధరల దుకాణాల డీలర్లతో కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి,ఆర్డిఓ సూర్యనారాయణల ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి,ఆర్డీవో సూర్యనారాయణలు పాల్గొని కోదాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రేషన్ దుకాణాల డీలర్లు అందరిని ఉద్దేశించి వారు పలు సూచనలు చేయడం జరిగింది.పేదలకు ప్రభుత్వం ఉచితంగా అందించే ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమ లాభార్జన కొరకు ఉపయోగిస్తున్నారు.కొంతమంది వ్యక్తుల వద్దనుండి డీలర్లు ప్రజా పంపిణీ బియ్యాన్ని కొంటున్నారు. అలా కాకుండా అర్హులందరూ అభియాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా చూసుకోవాలని కోరారు.పిడిఎస్ రైస్ గోడౌన్ లో నుండి చౌక ధరల దుకాణాలకు వచ్చే క్రమంలో గాని లేక పంపిణీ గ్రామంలో గాని ఎటువంటి అవకతవకలకు పాల్పడకూడదని ఒకవేళ అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికి వివరించడం జరిగింది.అదేవిధంగా గ్రామాలలో పిడిఎస్ రైస్ ని సేకరించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా పిడిఎస్ రైస్ నీ అక్రమంగా రవాణా,నిల్వ చేసే వ్యక్తులు,వాహనాలను కట్టడి చేసేందుకు అన్ని విధాల సహకరించాలని ప్రత్యేకంగా కోరడం జరిగింది.ఎవరైనా రేషన్ డీలర్లు ప్రజా పంపిణీ బియ్యానికి సంబంధించి అక్రమాలలో భాగస్వాములు అయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు వారి డీలర్ షిప్ సస్పెన్షన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా అధికారులు డీలర్లకు వివరించడం జరిగింది.
Pls subscribe to my channel https://www.youtube.com/live/0_KjbD240G4?si=oNdQ779d_tKUaZ7s