ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వాకర్స్ క్లబ్ ఆర్థిక ప్రోత్సాహం….
:విద్యార్థులు సామాజిక సేవా దృక్పథం అలవర్చుకోవాలి…
:సర్కారు బడి విద్యార్థులు జిల్లా టాపర్ గా నిలవడం అభినందనీయం…..
:వాకర్స్ క్లబ్ ఆర్థిక ప్రోత్సాహం అందించడం అభినందనీయం.
:బాయ్స్ హై స్కూల్ విద్యాభివృద్ధిలో వాకర్స్ క్లబ్ భాగస్వామ్యం కావాలి.
:కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్.
Mbmtelugunews//కోదాడ,మే 11(ప్రతినిది మాతంగి సురేష్):పట్టణంలోని పిఎంసి జడ్పీ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతిలో జిల్లా టాపర్గా ప్రతిభ కనబరిచిన విద్యార్థులు తాళ్లూరి రేఖ శ్రీ 571 మార్కులు,కే నరేందర్ 549 మార్కులు సాధించిన,పేద కుటుంబానికి చెందిన విద్యార్థులను జడ్పీ బాయ్స్ హై స్కూల్ లో నిత్యం వాకింగ్ చేస్తున్న వాకర్స్ క్లబ్ సభ్యులు పుష్పగుచ్చం,మెమొంటో,శాలువాతో ఘనంగా అభినందన సన్మానం చేసి ఇద్దరికీ ఆర్థిక ప్రోత్సాహంగా 5000,3000 రూపాయలు అందించడం జరిగింది.ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ బాధ్యులు కళ్యాణ్ బాబు,తిరుపతయ్య,జానకిరామ్ రెడ్డి,జొన్నలగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ సాధారణ విద్యార్థులు ఉపాధ్యాయుల గైడెన్స్ తో స్వయంగా కష్టపడి చదివి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచడం నిజంగా గొప్ప విషయం,అభినందనీయమని,వారికి ఆర్థిక సహాయం అందించి తోడ్పడటం వాకర్స్ క్లబ్ కృషి అభినందనీయమని మాట్లాడినారు.పాఠశాల గెజిటెడ్ హెచ్ఎం ,కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినారు.సూర్యాపేట జిల్లా టాపర్గా నిలిచిన పాఠశాల విద్యార్థులను అభినందించడం వాకర్స్ క్లబ్ కృషికి అభినందనలు తెలిపినారు.భవిష్యత్తులో పాఠశాల విద్యాభివృద్ధిలో వాకర్స్ క్లబ్ సభ్యులు భాగస్వాములు కావాలని కోరారు.ప్రభుత్వ బడిలో చదవడం ద్వారానే విద్యార్థులకు సంపూర్ణ వికాసం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ,ఉపాధ్యాయులు బడుగుల సైదులు,వాకర్స్ క్లబ్ సభ్యులు వీరభద్రం,అశోక్,కాజా ఫాతిమా,కోదండపాణి,అబ్దుల్,ఖాజా,మధు,ఇంద్ర కిరణ్,దస్తగిరి,ఖాజా మియా,సతీశ్,కాంతయ్య,మురళి,ముస్తఫా,విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు.