కోదాడ,మార్చి 02(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలో ఏడు దశాబ్దాలుగా పట్టణ పరిసర ప్రాంత పూజలందుకుంటున్న శ్రీ కోదండరామ స్వామి బోలా లింగేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి తదితర దేవతా సముదాయంతో కూడిన కోదండ రామాలయం పునర్నిర్మాణము గావించుకుంది ఈనెల 16 నుండి 20వ తేదీ వరకు ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ ధర్మకర్తలు నాగు బండి లక్ష్మయ్య నాగు బండి రంగా నాగ బండి రంగనాదులు తెలిపారు ఈ నేల 16న శోభాయాత్రతో ప్రారంభమయ్యే ఉత్సవాలు 20వ తేదీన అన్ని దేవత ముర్తుల విగ్రహాల ప్రతిష్టతో కార్యక్రమం ముగుస్తుందన్నారు 16 నుండి 20 వరకు పట్టణంలోని నాగు వంటి రామ్మూర్తి నగర్ లో కకళ్యాణార్థం పలు హోమాలు నిర్వహించబడునట్లు వారు తెలిపారు అదే విధంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు పలువురి కళాకారుల కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రతిష్ట కోసం తెప్పించిన జీవద్వజస్తంభాలను శనివారం దేవాలయ ప్రాంగణంలో ప్రతిష్టకు సిద్ధం చేసినట్లు వారు తెలిపారు.కోదాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.
ప్రతిష్టకై ధ్వజస్తంబాల ఏర్పాటు
RELATED ARTICLES



