Sunday, February 8, 2026
[t4b-ticker]

ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంట ఏర్పాటు చేసుకోవాలి సర్పంచ్ గోసుల రాజేష్

ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంట ఏర్పాటు చేసుకోవాలి సర్పంచ్ గోసుల రాజేష్

Mbmtelugunews//నడిగూడెం, ఫిబ్రవరి 06(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని చెన్న కేశవపురం గ్రామ పంచాయతీ నందు నీటి నిలువ (ప్రతి నీటి బొట్టును నీటి సంరక్షణ) పనుల ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, చెక్ డామ్స్, బోర్ వెల్ రీఛార్జ్ లు మొదలుగు పనులను సర్పంచ్ గోసుల రాజేష్, ఉపసర్పంచ్ కటికల పుల్లయ్య భూమి పూజ చేశారు. అనంతరం సర్పంచ్ రాజేష్ మాట్లాడుతూ భూమిలో రోజురోజుకు నీటి శాతం తగ్గుతున్నది రాబోయే తరాలకు నీరు దొరకని పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలి వాడుకున్న నీరును ఇంకుడు గుంతలలోకి వెళ్లే విధంగా చూసుకోవాలని అన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం వలన గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలని అన్నారు. ఇట్టి కార్యక్రమం నకు ఎంపీడీవో, ఏపీవో, ఈసీ, టిఏ వార్డు సభ్యులు పప్పుల ఉపేందర్, పప్పుల ఉమ, పచ్చిగోళ్ళ స్వరూప, కలకొండ మనోజు, సంకోజు, కర్ణాచారీ, శివరాత్రి వీరబాబు, దార విజయ, గ్రామ పెద్దలు గుజ్జర్లపూడి అర్జున్ రావు పాల్గొన్నారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular