ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలి: బంకా వీరేంద్రనాథ్
Mbmtelugunews//సూర్యాపేట, జులై 19(ప్రతినిధి మాతంగి సురేష్): ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని సూర్యాపేట జిల్లా ఎస్ ఆత్మకూరు మండలం కందగట్ల పల్లె దావకాన వైద్యాధికారి వీరేంద్రనాథ్ పిలుపునిచ్చారు. వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా శనివారం ఎస్ అత్మకూర్ మండల పరిధిలోని కందగట్ల పల్లె దావకాన ఆవరణలో కార్యక్రమాన్ని నిర్వహించి సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించినట్లయితే అవి పెరిగి పెద్దదై జీవకోటికి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చి ఎంతోమంది మానవ మనుగడకు ఉపయోగపడతాయని తెలిపారు. నేడు ఆక్సిజన్ ని కొనుక్కునే పరిస్థితులు ఏర్పడ్డాయని ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు చెట్లను పెంచాలని తెలిపారు. అలాగే నాటిన చెట్లు పెరిగి పెద్దవై తినే ఫలాలను, సేద తీర్చుకునేందుకు నీడనిస్తాయని తెలిపారు. అలాగే గ్రామాలలో పచ్చదనం ఏర్పడటంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారిస్తాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.