కోదాడ,డిసెంబర్ 16(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని సిరి ఫౌండేషన్ చైర్మన్ మొలుగూరి గోపి కోరారు. శనివారం కోదాడ మండలం చిమిర్యాల గ్రామంలో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది అన్నారు. 1960 హరిత విప్లవం తర్వాత భారతదేశంలో చిధాన్యాల సాగు, వినియోగం క్షీణించింది అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమకున్న వ్యవసాయ భూములలో కొద్దిపాటి భూములలో చిరుధాన్యాల సాగు చేపట్టాలని కోరారు.ఈ సందర్భంగా చిరుధాన్యాలైన రాగులు, కొర్రలు,అండుకొర్రలు,అరికలు, సామలు,జొన్నలు,సజ్జలు,తదితర పంటల సాగులో మెలకువలు, యాజమాన్య పద్ధతులు వివరించడం జరిగింది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు చిరుధాన్యాలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయన్నారు. మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం లేదన్నారు. ఒకవేళ మధుమేహం, రక్తపోటు ఉంటే అవి అదుపులో ఉంటాయన్నారు. అనంతరం నిర్వహించిన చిరుధాన్యాల ప్రదర్శన ఆకట్టుకున్నది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండ శైలజ,రైతులు శ్రీనివాసరావు,రామనాథం,సతీష్,శివారెడ్డి,లియాఖత్,వెంకటరమణ,కాశమ్మ,కేశవయ్య,నాగుల్ మీరా పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలు ఆహారంగా తీసుకోవాలి.
RELATED ARTICLES



