ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనాలు
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 08(మనం న్యూస్): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం మరియు వ్యవసాయ శాఖ చేపట్టి నటువంటి ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం అనే కార్యక్రమంలో భాగంగా బరాకత్ గూడెం గూడెం , మాధవరం మరియు గణపవరం గ్రామాలలో వరి KNM 1638 అనే రకం పండించిన రైతులు రానబోతు వీరారెడ్డి, శాఖమూడి అరవింద్, చందా రాధాకృష్ణ పొలాలలో క్షేత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జయశంకర్ విద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ ఏ రామకృష్ణబాబు, మునగాల మండల వ్యవసాయ అధికారి బుంగ రాజు పాల్గొని ఈ రకం యొక్క లక్షణాలను గురించి రైతులకు వివరించడం జరిగింది. KNM 1638 అనే రకం అగ్గి తెగులు, ఉల్లికోడు తట్టుకొని తక్కువకాల పరిమితి గల అనగా 125 రోజులకే పంట చేతికి వచ్చె, సన్నగింజ రకము.
దీని యొక్క అన్నం క్వాలిటీ కూడా సాంబ మసూరి లాగా ఉంటుంది.
దీనికి కంకికి గింజలు దాదాపు 250 నుంచి 300 వరకు గమనించడం జరిగింది.
అలాగే కాండం తొలిచే పురుగు ఉధృతి కూడా పెద్దగా లేనందు వల్ల మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 75 కిలోల బస్తాలు 38 నుంచి 40 బస్తాల వరకు రావచ్చు అని అంచనా వేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు జయశంకర్ విద్యాలయం వారి వరి రకాలు ప్రైవేట్ కంపెనీలకు ఏమాత్రం తీసిపోకుండా తెగుళ్లను, పురుగులను తట్టుకొని నాణ్యమైన గింజలతో మంచి దిగుబడును ఇచ్చే రకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు ఈ రకాన్ని ఇప్పుడు పండించిన రైతుల దగ్గర నుంచి విత్తనం సేకరించి వారు కూడా రాబోయే యాసంగి, వచ్చే సంవత్సరం వాన కాలంలో కూడా ఈ రకాలను పండించుకుంటే వారి విత్తనాలను వారే తయారు చేసుకుని వాడుకోవడానికి అనువుగా ఉంటుంది అని సూచించడం జరిగింది.



