కోదాడ,జులై 15(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అనంతగిరి మండల పరిధిలోని 2వ రోజు మన ఊరుకు మన గడపకు అంజి యాదవ్ కార్యక్రమం లకారం శాంతినగర్,మొగలాయి కోట,కిష్టాపురం గ్రామాలలో నిర్వహిస్తున్న సమయంలో ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు.అనంతరం మొగలాయి కోట గ్రామంలో మైసమ్మ,బొజ్జ రాంబాబులకు ఆర్థిక సాయం అందించిన అంజి యాదవ్.ఈ సందర్భంగా అంజి యాదవ్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలకు పూర్తయిన ఇంకా వాడలు మురికి వాడల గానే మిగిలిపోయాయి గ్రామాలకు సరైన రోడ్ల వసతులు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఎంతోమంది ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరా కోరగా అవకాశాలు కల్పించి ఉద్యమ సమయంలో లేని వారికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.గ్రామాలలో యువత చెడు అలవాట్లకు బానిస అయ్యి చదువుల గుడికి దూరమవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. కోదాడ నియోజకవర్గంలో యువత కొత్తతరాన్ని యువతనికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు దేశినేని,తోట కమలాకర్,వెంకటేష్ బాబు,నవీన్,కతిమాల వెంకన్న,వెంకటరత్నం,ముత్యాలరావు,రాములు,నరసయ్య, సుగుణమ్మ,ముత్యాల రాణి,సతీష్,నాగరాజు,వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.