ప్రత్యర్థిని మట్టికరిపించిన అమన్.!
Mbmtelugunews//పారిస్, ఆగష్టు 10 ప్రతినిధి మాతంగి సురేష్:పారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరో పతకం సాధించింది.పురుషుల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్లో భారత్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ ప్యూర్టోరికో రెజ్లర్ క్రూజ్ పై 13–5తేడాతో విజయం సాధించాడు.బౌట్లోకి దిగినప్పటి నుంచే సెహ్రావత్ సత్తా చాటాడు.తన పట్టు ఏంటో మరోసారి నిరూపించాడు.రెండ్రోజల క్రితం వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ నుంచి ఔట్ కావడంతో రెజ్లింగ్లో భారత్ మెడల్తో తిరిగి వస్తుందా లేదా అనుకున్న సమయంలో ఆ కలను నిజం చేశాడు అమన్ సెహ్రావత్. బౌట్లోకి దిగిన్పటి నుంచే ఈ యువ రెజ్లర్ ప్రత్యర్థి ప్యూర్టోరికో రెజ్లర్ క్ర్పూ మెరుపు దాడి చేశాడు.ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా అమన్ తన సత్తా చాటాడు.హరియాణాకు చెందిన అమన్ సెహ్రావత్ తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్ లోనే కాంస్య పతకం సాధించి భారత్ ని సగర్వంగా అంతర్జాతీయ వేదికపై నిలబెట్టాడు.ఇక 21 ఏళ్లకే ఒలింపిక్స్ లో పాల్గొని 57 కేజీల పురుషుల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించాడు.దీంతో భారత్ పతకాల పట్టికలో మరో పతకం వచ్చి చేరగా మొత్తంగా ఆరు పతకాలు వచ్చాయి.ఇందులో 5 కాంస్య పతకాలు ఒకటి వెండి పతకం ఉంది.