ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని వ్యాసరచన పోటీ……
విద్యా, వైద్యం ద్వారా మానవ వనరుల అభివృద్ధి. …..
:కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్
Mbmtelugunews//కోదాడ, జులై 11 (ప్రతినిది మాతంగి సురేష్): శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పిఎం శ్రీ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో అభివృద్ధిలో జనాభా పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోదాడ మండల విద్యాధికారి, పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎండి సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడినారు.విద్య, వైద్యంపై చేసే పెట్టుబడుల వలన మానవనరుల అభివృద్ధి జరుగుతుంది. సరైన ప్రణాళికలను అమలు చేస్తే జనాభా అభివృద్ధికి వరమే అన్నారు.

గతంలో జనాభా నియంత్రణ కోసం పనిచేసిన దేశాలు కూడా ప్రస్తుతం ఆ నిబంధనలను సడలించడం జరుగుతుందని తెలిపారు. జనాభా అభివృద్ధికి మధ్య గల సంబంధం పై విద్యార్థుల ఆలోచన తీరును తెలిపే విధంగా, సాంఘిక శాస్త్ర విభాగం ఉపాధ్యాయులు వ్యాసరచన పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పికె అనహా ఫాతిమా (ప్రధమ), ఎస్ కె మదీనా(ద్వితీయ), టి సాయి మణికంఠ (తృతీయ) లకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు కె కరుణ, కె రవికుమార్, బడుగుల సైదులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.