ప్రపంచ దేశాలు మొత్తం జరుపుకునే పండుగ క్రిస్మస్: పాలకి సురేష్
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 26(ప్రతినిధి మాతంగి సురేష్): ప్రపంచ దేశాలు మొత్తం ఒకేసారి జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అని దొరకుంట గ్రామ సర్పంచ్ పాలకి సురేష్ అన్నారు. మండల పరిధిలోని దొరకుంట గ్రామంలో ఇందిరా కాలనీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గ్రామ సర్పంచ్ పాలకి సురేష్ పాల్గొని కేక్ కట్ చేసి గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనవని వాటి ప్రకారం సమాజంలో జీవిస్తూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ రమాదేవి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ గద్దల వెంకటేశ్వర్లు, మైనార్టీ నాయకుడు వార్డు మెంబర్ పాలడుగు జాన్, వార్డ్ ఇంచార్జ్ మొలుగురి ఏసోబు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



