ప్రపంచ వస్త్ర రంగ పటంలో తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి!
Mbmtelugunews//హైదరాబాద్:ఏప్రిల్ 03
తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా అగ్రపథాన నిలిపేందుకు పారిశ్రామిక వేత్తలు కలిసి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్ లో నిర్వహించిన ఆసియా టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
టెక్స్ టైల్ రంగ ప్రముఖు లకు స్వాగతం పలుకుతూ తెలంగాణను ప్రపంచ వస్త్ర రంగ పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వ దార్శనీకతను పంచుకున్నా రు.2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
ఇందుకోసం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూనే పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు తీయిస్తామని పేర్కొన్నారు.
వస్త్రాల రూపకల్పనలో భారతదేశానికి ఉన్న గొప్ప చరిత్రను రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.టెక్స్‌టైల్స్ అనేది కేవలం ఒక పరిశ్రమ మాత్ర మే కాదు.. అది చేనేత కార్మికుల జీవితం. తెలంగా ణను దక్షిణాసియాలోనే టెక్స్‌టైల్స్ క్యాపిటల్’గా తీర్చిదిద్దుతాం అని ఆయ న ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని, భవిష్యత్తులోనూ అదే జోరు కొనసాగిస్తామని చెప్పారు.
హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే అత్యుత్తమ ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్‌గా ఎదిగిందని సీఎం కొనియా డారు. చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి ప్రోత్సాహం ఉంటుందని వెల్లడించారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబ డిదారులు ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.



