ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి.
:పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం.
:సమస్యల పరిష్కారంకై ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం.
విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య.
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 07(ప్రతినిధి మాతంగి సురేష్):రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయి సంవత్సరం గడుస్తున్నా పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రభుత్వం ఐదు డిఏలు ఇవ్వాల్సి ఉండగా ఒక డిఏ మంజూరు చేసి అది కూడా 17 వాయిదాలలో ఇస్తాననడం చాలా బాధాకరం అన్నారు.నగదు రహిత వైద్య సేవలు అందించడంతోపాటు కమ్యూటేషన్ పెన్షన్ 135 నెలలకు తగ్గించాలనే రెండు ప్రధాన సమస్యలపై రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు ప్రభుత్వంపై పోరాడేందుకు పెన్షనర్లు సిద్ధంగా ఉండాలన్నారు.ఒకటో తారీకు పెన్షన్ ఇవ్వడం తప్ప ప్రభుత్వం తమ ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శరత్ బాబు,ఖమ్మం జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య,సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు,సుబ్బయ్య,కోదాడ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు,రఘు వరప్రసాద్,హమీద్ ఖాన్,పొట్ట జగన్మోహన్ రావు,విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.