ప్రభుత్వాలు మారినా మారని నిరుద్యోగుల తల రాతలు
హైదరాబాద్,జులై 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్ లో నిర్వహించి పోస్టులు పెంచాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడాన్ని నిరసిస్తూ నేడు నిరుద్యోగులు టీజీఎస్పిఎస్సి భవనాన్ని ముట్టడిస్తూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. నాడు రాష్ట్రం కోసం,మొన్న పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా,నేడు పోస్టులు పెంచి ఎగ్జామ్ వాయిదా కోసం ప్రశ్నిస్తూనే ఉన్నారు నిరుద్యోగులు.అధికారం కోల్పోయిన భారాస బాటలోనే నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని నిరుద్యోగులు వారి కుటుంబాల ఉసురు తగిలి ప్రభుత్వాలే కూలిపోయాయనే విషయాన్ని మరవొద్దు అని ఓయూ జేఏసీ గౌరవ అధ్యక్షులు మట్టపల్లి వీరూ గౌడ్ పేర్కొన్నారు.