Tuesday, December 24, 2024
[t4b-ticker]

ప్రభుత్వ అసమర్థత వల్లనే సాగర్ కాలువకు గండి

- Advertisment -spot_img

ప్రభుత్వ అసమర్థత వల్లనే సాగర్ కాలువకు గండి

:ముఖ్యమంత్రి,మంత్రుల బాధ్యతారాహిత్యం మూలంగానే ఇంతటి నష్టం.

:ఆనాటి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ను నేడు అమలు చేయాలి.

:సాగర్ కాలువ గండి ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ మంత్రులు హరీష్ రావు,జగదీష్ రెడ్డి.

Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 03:ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రైతుల పక్షాన తమ ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండల పరిధిలోని కాగిత రామచంద్రాపురం గ్రామ సమీపంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ కట్ట 132కిలో మీటర్ వద్ద పడిన గండి ప్రాంతాన్ని వారు మంగళవారం పరిశీలించి మాట్లాడారు.. ప్రభుత్వ అసమర్థత వల్లనే సాగర్ కాలువకు గండి పడిందని,ముఖ్యమంత్రి,మంత్రుల బాధ్యతారాహిత్యం మూలంగానే ఇంతటి నష్టానికి కారణమైందని వారు ఆరోపించారు.ప్రమాద సమయాల్లో ఓపెన్ చేసే ఎస్కేప్ ఛానల్ వున్నప్పటికీ దాన్ని తెరవకుండా ఉదాసీనంగా వ్యవహరించారని విమర్శించారు.ఎస్కేప్ ను తెరవాలని రైతులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం పెడచెవిన పెట్టి వారి కన్నీటికి కారణమయ్యారని దుయ్యపట్టారు.రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు పోరాడుతుందని,రైతుల పక్షాన అసెంబ్లీలో కొట్లాడుతామని తెలిపారు.పంట నష్టపోయిన రైతుల ప్రతి ఎకరాకు 30 వేలు,పంట పొలాల్లో ఇసుక మేట వేసిన వారికి 50వేల చొప్పున పరిహారం అందజేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.అనంతరం ఇసుక మేట వేసిన పంట పొలాలను పరిశీలించిన వారు రైతులు అధైర్యపడవద్దని ధైర్యంగా వుండాలని సూచించారు.ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందించేంతవరకు తమ తరపున పోరాడుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి,వివేకానంద గౌడ్,ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు,మాజీ ఎమ్మెల్యే లు బొల్లం మల్లయ్య యాదవ్,గాదరి కిషోర్,చిరుమర్తి లింగయ్య,కంచర్ల భూపాల్ రెడ్డి,మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్,వెంకట నరసయ్య గౌడ్,పల్లా నర్సిరెడ్డి,గార్లపాటి శ్రీనివాసరెడ్డి,నీలకంఠం వెంకన్న,నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular