ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారికి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సన్మానాలు
Mbmtelugunews/గరిడేపల్లి,అక్టోబర్ 28(ప్రతినిధి మాతంగి సురేష్):ఇటీవల విడుదలైన డీఎస్సీ పరీక్ష ఫలితాలలో మండల పరిధిలోని పొనుగోడు గ్రామానికి చెందిన నందిపాటి జ్యోతి బాబు తండ్రి మట్టయ్య ఉత్తీర్ణత సాధించటం జరిగింది.గతములో అదే కుటుంబానికి చెందిన చిన్న కుమారుడు శ్రీను (ఏఈ) గా ఉద్యోగం పొందినారు.వీరి ఇరువురిని అంబేద్కర్ యూత్ కమిటీ తరఫున సన్మానించటం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే ఆ తండ్రి వారి కొరకు ఎంత కష్టపడి ఉంటాడో అలానే ప్రతి ఒక్క కుటుంబంలో పిల్లలను మంచి చదువులు చదివించి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నందిపాటి శీను,అధ్యక్షులు నందిపాటి శ్రీను( ప్రవీణ్ ),కోశాధికారి సైదులు,కమిటీ సభ్యులు రాజు,హుస్సేన్,రాజేష్,పృద్వి,నాగరాజు,నాగేంద్రబాబు,సతీష్,పవన్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.