Sunday, February 8, 2026
[t4b-ticker]

ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి

ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి

:ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రెటరీ భీమ్ సింగ్.

Mbmtelugunews//నడిగూడెం, అక్టోబర్ 27 (ప్రతినిధి మాతంగి సురేష్):ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని కళాశాలలో నమోదైన ప్రతి విద్యార్థి కళాశాల హాజరయ్యేలా అధ్యాపకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రెటరీ భీమ్ సింగ్ అన్నారు. సోమవారం నడిగూడెం కళాశాలను సందర్శించినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నవంబర్ 1 నుంచి 90 రోజుల కార్యచరణ ప్రణాళికను ప్రతి అధ్యాపకుడు అనుసరిస్తూ విద్యార్థులను పూర్తిస్థాయిలో వార్షిక పరీక్షలకు సంసిద్ధం చేయాలన్నారు ఎఫ్ ఆర్ ఎస్ లో నమోదైన ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలన్నారు వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు ఇంటర్ బోర్డు కమిషనర్ ప్రత్యేక చొరవతో డిజిటల్ తరగతులు కళాశాలలో త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు కళాశాలలో ఉదయం సాయంత్రం వేళలో తప్పనిసరిగా అధ్యయన తరగతులు నిర్వహించాలన్నారు కళాశాలకు హాజరుకాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి కళాశాలకు వచ్చేలా చూడాలన్నారు 75% హాజరు ఉంటేనే వార్షిక పరీక్షలకు ఫీజు తీసుకోవడం జరుగుతుందనే విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాల్సిన బాధ్యత అధ్యాపకుల అదే అన్నారు సకాలంలో సిలబస్ పూర్తి చేసి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు మంచి ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు చేయాలన్నారు నడిగూడెం కళాశాలలో విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించేందుకు సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులను నమోదు చేసేందుకు మీ మండలాల పరిధిలోని ఉన్నత పాఠశాలలకు వెళ్లి ప్రభుత్వ కళాశాలలో ఉన్న వసతులు కోర్సులు ఉపయోగాలను అధ్యాపకులు విద్యార్థులకు వివరించి కళాశాలలో నమోదయ్యేలా చూడాలన్నారు. ప్రతి అధ్యాపకునికి ఒక ఉన్నత పాఠశాలను అప్పగించాలన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ నాయక్ అధ్యాపకులు జాన్ పాషా శ్రీధర్ కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం అధ్యాపకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి బోర్డు సూచనలను తప్పనిసరిగా అమలు చేయాలని అధ్యాపకులను ఆదేశించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular