ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్నాం.
:ప్రజలకు ఉద్యోగులకు అందుబాటులో అన్ని అంగులతో సొంత ప్రభుత్వ కార్యాలయాలు.
:అద్దె భవనాల ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నాం.
:కోదాడలో నూతన ఆర్డీవో కార్యాలయ భవన ప్రారంభంలో ఎమ్మెల్యే బొల్లం
కోదాడ,అక్టోబర్ 04మనం న్యూస్:ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భావనాలు కట్టించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.బుధవారం కోదాడ తాసిల్దార్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన ఆర్డీవో కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు గత పాలకుల హయాంలో చాలీచాలని వస్తువులతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల ప్రజల ఇబ్బందులు తొలగించడానికి వేల రూపాయల బడ్జెట్ అన్ని హంగులతో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తున్నారన్నారు.ఇటీవల నూతన జిల్లాలన్నింటికీ అన్ని హంగులతో కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మించి ప్రారంభించారన్నారు.ప్రజలకు అన్ని సౌకర్యాలతో కార్యాలయాలని అందుబాటులోకి వచ్చాయన్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకమైన పాలన అందిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ,తహసిల్దార్ సాయి గౌడ్,ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి,డిఏఓ దేవకర్ణ,ఆర్డీఓ ఆఫీస్ సిబ్బంది డిటి అనిల్ కుమార్,నలమాద భవాని,గంటేపంగ విక్రమ్,శ్వేత,సరస్వతి,మోహినిద్దీన్,పావని,రాధిక,రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



