ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం :సర్పంచి పాలకి సురేష్
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 02(ప్రతినిధి మాతంగి సురేష్): ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సర్పంచి పాల సురేష్ అన్నారు. మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన ప్రగతికి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచి పాలకి సురేష్ అధ్యక్షతన గ్రామసభ సమావేశం జరిగినది.ఈ సమావేశంలోఅధికారులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లు ఇందిరమ్మ ఇల్లు ,పెన్షన్లు, ప్రతి కుటుంబానికి ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా 5 లక్షలు ఆర్థిక సంవత్సరంలో ఇస్తారని చెప్పినారు .ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీవో సూర్యనారాయణ, డిఎల్పిఓ పార్థసారథి, ఎంపీడీవో ఇస్సాక్ అహ్మద్, ఎమ్మార్వో వాజిద్ అలీ, రూరల్ ఎస్ఐ గోపాల్ రెడ్డి, వై సర్పంచి పత్తిపాక రమాదేవి, వార్డ్ మెంబర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, హై స్కూల్ హెడ్ మాస్టర్ లింగారెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



