ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యా భోదన.
:వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్.
Mbmtelugunews//కోదాడ,జూన్ 12 (ప్రతినిది మాతంగి సురేష్)ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య బోధన లభిస్తుందని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరితమ్మ సుధీర్ అన్నారు.గురువారం నడిగూడెం మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడుతూ కొల్లు పాపయ్య చౌదరి ఎంతోమంది పేద విద్యార్థుల చదువు కొరకు 12 ఎకరాల భూమిని దానం చేసి ఎంతోమంది విద్యార్థులు చదువుకొని వారి జీవితాల వెలుగు నింపుకోవడానికి కారణమయ్యారన్నారు.ఉచిత విద్య మంచి భోజనం విశాలమైన ఆట స్థలం ఉచిత పాఠ్యపుస్తకాల తోపాటు దుస్తులు ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని చదువుతోపాటు మెళుకువలు నేర్పుతారని తెలిపారు.ప్రవేటు పాఠశాలను,కళాశాలను నమ్మి లక్ష రూపాయలు వెచ్చించి విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారన్నారు అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నత శిఖరాలలో ఉన్నారని తెలిపారు.ప్రైవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు అని నినాదించారు.ఎంతో చరిత్ర గలిగిన హై స్కూల్ లో విద్యార్థులను చేర్చి ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని ఆమె పూర్వ విద్యార్థులకు తల్లిదండ్రులకు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాస్,డిప్యూటీ తహసిల్దార్ ప్రియదర్శిని,శోభన్,మీరాజుద్దీన్,కత్తి వెంకటేశ్వర్లు,శ్రీదేవి,అహల్యదేవి,పర్వతాలు,విఎల్ఎన్ చారి,వేంకటేశ్వర్లు,వీరబాబు తదితరులు ఉన్నారు.