ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి…
Mbmtelugunews//(కోదాడ)చిలుకూరు, ఏప్రిల్ 08(ప్రతినిధి మాతంగి సురేష్): బుధవారం మండల పరిధిలోని బేతవోలు జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యా యులు ఐదో వార్డు ఇందిరా నగర్ యందు బడిబాట కార్యక్రమం లో భాగంగా పంట పొలంలో వ్యవసాయ కూలీలతో ఇంటరాక్ట్ అయ్యి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.

పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు ,సదుపాయాలు కంప్యూటర్ విద్య, పాఠశాలలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలతో కూడిన ఫ్లెక్సీ తో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు , విద్యార్థులు ను కలిసి 5వ తరగతి పూర్తి చేసిన తర్వాత 6 వ తరగతికి ప్రభుత్వబడి జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్పించాలని కోరినారు. బడిబాట కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాగి గురవయ్య, ఉపాధ్యాయులు చందా శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, వీరబాబు, శౌరి,వెంకన్న, ఉపేందర్, శ్రీరాములు, కృష్ణ, కల్పన, ప్రకాష్, వెంకటేశ్వర్లు, నరసింహారావు, మైసయ్య, లాల్ మహమ్మద్, రాజ్యం, విద్యార్థులు పాల్గొన్నారు.



