ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారం మరువలేనిది: ఎంఈఓ ఎం గురవయ్య
Mbmtelugunews//కోదాడ/చిలుకూరు,నవంబర్ 16 (ప్రతినిధి మాతంగి సురేష్)మండల పరిధిలోని బేతవోలు గ్రామానికి చెందిన విద్యావంతులు కంచర్ల సత్య బాబు వారి తండ్రిగారైన కీర్తిశేషులు కంచర్ల రాములు జ్ఞాపకార్థం పాఠశాలకు 15వేల రూపాయల విలువ గలిగిన సౌండ్ బాక్స్ లు,మైక్ స్టాండ్,పోడియంను పాఠశాల ప్రధానోపాధ్యాయులు,చిలుకూరు మండల ఎంఈఓ ఎం గురవయ్యకి పాఠశాలలో శనివారం అందజేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఇటువంటి దాతల ప్రోత్సాహం వల్ల పాఠశాలలో సకల సౌకర్యాలు సమకూర్చబడి అవి పిల్లల పురోగతికి ఎంతో దోహదము అవుతాయని తెలియజేశారు.దాత కంచర్ల సత్యబాబు మాట్లాడుతూ ఇవేకాక ఈ సంవత్సరము 10వ తరగతి ఫలితాలలో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు పదివేల రూపాయలు ప్రోత్సాహకముగా ఇస్తానని తెలియజేశారు.అనంతరం కంచర్ల సత్య బాబుని పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెడ్ మాస్టర్ కవిత,ఉపాధ్యాయులు చందా శ్రీనివాసరావు,కోటేశ్వరరావు,వీరబాబు,ఎలమర్తి శౌరి,వెంకన్న,ఉపేందర్,శ్రీరామ్,కృష్ణ,ప్రకాశం,వెంకటేశ్వర్లు,నర్సింహారావు,ఆర్ఎ లాల్,ఓఏస్ రాజ్యం,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.