హుజూర్ నగర్,ఆగష్టు 10(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సాయంత్రం సమయంలో రాగిజావను అందించడం అభినందనీయమని మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు అన్నారు. గురువారం హుజూర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు మండల విద్యాధికారి బి సైదా నాయక్ లు పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశంతో సాయంత్రం సమయంలో రాగిజావ నీ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని అన్నారు. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మల్లెల ఉదయశ్రీ,ఉపాధ్యాయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి,మాతంగి ప్రభాకర్ రావు,ఉపేందర్,దీనారాణి,అరుణరాణి,శేషగిరి,అన్వేష్,వెంకటేశ్వర్లు,వసంతరావు,రవీందర్ రెడ్డి,అశోక్ కుమార్,జానీ బేగం,శేఖర్,మున్ని బేగం మరియు విద్యార్థులు పాల్గోన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో పౌష్టిక ఆహారం విద్యార్థులకు అందించడం అభినందనీయం:జక్కుల నాగేశ్వరరావు
RELATED ARTICLES