ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు
చిలుకూరు,జూన్ 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యతో పాటు పూర్తి స్థాయి మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నట్లుగా జెడ్పీటీసీ బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు,ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య లు అన్నారు.బుధవారం చిలుకూరు జిల్లా పరిషత్ పాఠశాలలో పాఠశాల తొలిరోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు,నోట్ పుస్తకాలు,దుస్తుల పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అబివద్దికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి విద్యార్థుల సంఖ్యను పెంచాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధృవకుమార్,ఎంపీడీవో గిరిబాబు,చిలుకూరు పీఏసీఎస్ చైర్మన్ అలసకాని జనార్ధన్,మాజీ సర్పంచ్ కొడారు బాబు,పాఠశాల హెచ్ఎమ్ కరుణాకర్రెడ్డి,పాఠశాల చైర్మన్.. రంజాన్బీ,ఏపీఎమ్ దుర్గాప్రసాద్,ఉపాధ్యాయులు,సంఘ బంధం సభ్యులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



