ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు
అనంతగిరి,జూన్ 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యతో పాటు పూర్తి స్థాయి మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నట్లుగా పిఎసిఎస్ చైర్మన్ నేలకుర్తి ఉషారాణి ఎంపీటీసీ మన్యం కృష్ణవేణి చిన్న బడి స్కూల్ చైర్మన్ తోట సువార్త లు అన్నారు.బుధవారం అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పాఠశాల తొలిరోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు,నోట్ పుస్తకాలు,దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాల హెడ్మాస్టర్ సుధాకర్ ఏర్పాటు చేసినారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఎసిఎస్ చైర్మన్ నేలకుర్తి ఉషారాణి ఎంపీటీసీ మన్యం కృష్ణవేణి చిన్న బడి స్కూల్ చైర్మన్ తోట సువార్త లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అబివద్దికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి విద్యార్థుల సంఖ్యను పెంచాలని అన్నారు.ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల పిల్లలను తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులు కంకణ బద్ధులై పని చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ఉపాధ్యాయులు,గ్రామస్తులు,విద్యార్థినీ,విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



