ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూత నివ్వాలి:ఎంఈవో గురవయ్య
Mbmtelugunews//కోదాడ/చిలుకూరు,అక్టోబర్ 17 (ప్రతినిధి మాతంగి సురేష్): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలని ఎంఈవో గురవయ్య అన్నారు.గురువారం మండలంలోని నారాయణపురం గ్రామంలో ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న 70 మంది విద్యార్థులకు గ్రామంకు చెందిన దేవరం సైదిరెడ్డి పౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10వేలు విలువ గల ఐడీ కార్డ్సు, డైరీ,బెల్ట్ తదితర వస్తువులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహాకరించాలని అన్నారు.అనంతరం దాత డీఎస్ఆర్ పౌండేషన్ నిర్వాహాకులు సైదిరెడ్డిని అభినందించారు.ఈ కార్యక్రమంలో పౌండేషన్ సభ్యులు బూర లక్ష్మినారాయణ,పాఠశాల హెచ్ఎమ్ కృష్ణయ్య,పాఠశాల చైర్మన్ మండవ రామాదేవి,సహా ఉపాధ్యాయులు గుర్వారెడ్డి,జ్యోతి,రమణనేశ్వరీ,పవనకుమార్ తదితరులు పాల్గొన్నారు.