ప్రభుత్వ బడి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ……
:కోదాడ బాయ్స్ హై స్కూల్ క్యాలెండర్ ఆవిష్కరణ…..
:పబ్లిక్ ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్ ఎడ్యుకేషన్……
:ప్రభుత్వ ఉపాధ్యాయుల సమిష్టి కృషితో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం అభినందనీయం….
:కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్.
Mbmtelugunews//కోదాడ,జనవరి 09 (ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కోదాడ లో గురువారం ఉపాధ్యాయుల సమిష్టి కృషితో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ రూపొందించి ఆవిష్కరణ చేయడం జరిగింది.కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినారు.అర్హత అంకితభావంతో బోధన చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషితో నూతన సంవత్సరం క్యాలెండర్ రూపొందించి ఆవిష్కరణ చేయడం హర్షినియమని అభినందించినారు.

ప్రభుత్వ బడిలోనే విద్యార్థుల సంపూర్ణ వికాసం జరుగుతుందని తెలిపారు.ఇదే స్ఫూర్తితో విద్యాబోధన చేసి విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం క్రమశిక్షణ నేర్పాలని కోరారు.క్యాలెండర్ లో ప్రభుత్వ బడుల సెలవులు,ఆప్షన్ హాలిడేస్,ప్రభుత్వ బడిలో ఉన్నటువంటి సౌకర్యాలు, ప్రత్యేకతలను తెలియజేస్తూ క్యాలెండర్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైనదని అని తెలిపారు.ఉపాధ్యాయులతో పాటు ప్రతి ఒక్క విద్యార్థికి క్యాలెండర్ ను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.