ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి…..
:నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి…….
:కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి…..
Mbmtelugunews//కోదాడ, జనవరి 10( ప్రతినిధి మాతంగి సురేష్): నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజవర్గవ వ్యాప్తంగా మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల బొకేలతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. మునగాల మండలం నరసింహుల గూడెం గ్రామ సర్పంచ్ కుంచం ఇందిరా, నరసయ్యలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీవో సూర్యనారాయణ చిమిర్యాల సర్పంచ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొత్త గురవయ్య, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి సర్పంచులు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు……



