ప్రభుత్వ హాస్పిటల్ లో జాతీయ జెండాను ఎగరవేసిన సూపరింటెండెంట్ డా, దశరథ
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 15(ప్రతినిధి మాతంగి సురేష్): 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డా, దశరథ జెండా ఎగరవేసి మాట్లాడుతూ. ఎంతోమంది అమరుల త్యాగమే నేడు స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహకారంతో కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని అన్నారు.

అన్ని అంగులతో హాస్పిటల్ ను తీర్చిదిద్దుతున్నారని పేషెంట్లు ప్రైవేటు హాస్పిటల్ లలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వ ఆస్పటల్ లోనే అన్ని సౌకర్యాలు ఉండే విధంగా మంత్రి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరసింహ నాయక్, డాక్టర్ వైష్ణవి, డాక్టర్ అభిరామ్, హౌస్ సర్జన్స్, ఆఫీస్ సిబ్బంది సతీష్ కుమార్, రమేష్, హెడ్ సిస్టర్స్, స్టాఫ్ నర్స్ లు, ఫార్మసిస్టు, హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



