ప్రమాణ స్వీకార సభ
ఏర్పాట్లు పరిశీలించిన ఎర్నేని..
నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలి రావాలి…
ఎర్నేని వెంకటరత్నం బాబు…
Mbmtelugunews//కోదాడ, జనవరి 22(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్,వైస్ చైర్మన్ ఎస్.కె బషీర్,మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సభ ఏర్పాట్లను కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు ఏర్పాట్లను పరిశీలించారు.బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నేడు జరగబోయే ప్రమాణ స్వీకార సభకు నియోజకవర్గ పరిధిలోని నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి,మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు ఇట్టి ప్రమాణ స్వీకార సభకు హాజరవుతున్నందున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి వీటి సభను విజయవంతం చేయాలని కోరారు.పరిశీలించిన వారిలో కౌన్సిలర్ ఖదీర్,కాజా,వంటిపులి రమా శ్రీనివాస్,కాంగ్రెస్ నాయకులు వంటిపులి వెంకటేష్,నెమ్మది దేవమని ప్రకాష్ బాబు,రావెళ్ళ కృష్ణారావు,మైలారిశెట్టి భాస్కర్,వేమూరి విద్యాసాగర్, గంధం పాండు,యువజన నాయకులు పోటు కోటేశ్వరరావు,పారా వెంకటేశ్వరరావు,లైటింగ్ ప్రసాద్,లక్ష్మణరావు,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.