ప్రమాదంలో కుక్క కాలు నుజ్జు-
ఆపరేషన్ తో అతికించిన అసిస్టెంట్ డైరెక్టర్
:నోరు లేని మూగ ప్రాణికి పునఃప్రాణం-
:కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో ఉన్న వసతులతోనే ఆర్థోపెడిక్ సర్జరీ-
Mbmtelugunews//కోదాడ,మార్చి 22(ప్రతినిధి మాతంగి సురేష్):సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం ఏరియా ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న అనంతారపు లక్షీ పెంపుడు శునకం ఈరోజు తెల్లవారు జామున తెలియని కారు తగిలి వెనుక కాలు జాయింట్ విరిగి,పగిలి,నరాలు తెగి,బొక్కలు బైటకు రాగా వైద్యం కోసం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలను సందర్శించారు.

విరిగిన కాలు తీవ్రతను పరిశీలించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య శాస్త్ర చికిత్స చేసి తెగిన నరాలను అనుసంధానం చేసి అతికించి,విరిగి,తొలగిన బొక్కలను సరిచేసి కండరాలను కుట్లు చేసి గాయాన్ని పూడ్చి ఆర్థోపెడిక్ సర్జరీ తరహాలో సిమెంట్ కట్టు కూడా వేసి కుక్కకి పునఃప్రాణం అందిచి ఆ కుక్క యజమాని కళ్ళల్లో ఆనందాన్ని నింపారు.అత్యంత విశ్వాసం గల మూగ జీవి కి నరకయాతన నుండి ఉపశమనం కలిగించిన అసిస్టెంట్ డైరెక్టర్ ని తమ పశువుల చికిత్సకోసం వైద్యశాలకు వచ్చిన పశుపోషకులు అభినందించారు.శస్త్రచికిత్స లో సిబ్బంది రాజు చంద్రకళ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.