ప్రమాదంలో దవడ పెదవి దంతాలు విరిగిన గేదెకి విజయవంతంగా శస్త్ర చికిత్స
:కోదాడ ప్రాంతీయ పదువైద్యశాలలో అరుదైన శస్త్ర చికిత్సతో గేదెకి పునఃప్రాణం.
:రోడ్డు ప్రమాదంలో గేదెకి విరిగిన కింది దవడ ఎముక పంటి పలక.
:నొప్పితో రెండురోజులు మేత నీటికి దూరం.
Mbmtelugunews//కోదాడ,మే 28(ప్రతినిధి మాతంగి సురేష్)తొలిసారిగా ఆర్థోపెడిక్ డెంటల్ సర్జరీ తో విరిగిన దవడ ఎముక,పంటి ఎముకను అతికించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా, పి పెంటయ్య.చిలుకూరు మండల పరిధిలోని ఆర్లగూడెం గ్రామానికి చెందిన ఆరే వెంకటరమణ పాడిగేదే ఆదివారం మేతకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం తో కింది దవడ ఎముక విరిగి దంతాల ప్యాడ్ కూడా పెదవి నుండి విడిపోయి రెండురోజులకి ఇంటికి చేరుకున్న గేదె నోటి ఎముక దంతాలు విరగడం తో మేత నీరు లేక బాధపడుతుండడం చూసి కుటుంబం కన్నీరు మున్నీరై అత్యవసర చికిత్స నిమిత్తం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకు వచ్చారు.

కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య గేదె గాయాల తీవ్రతను పరిశీలించి విరిగిన భాగం కింది దంతాల ప్యాడ్ మొత్తం తీసివేయాలని సూచించడం తో కలత చెందిన రైతు అలా అయితే తన గేదె మేత తినలేదని అది చూసి మేము తట్టుకోలేమని,ఏదైనా ఒకటి చేసి నా గేదెని బ్రతికించాలని పదే పదే ప్రాధేయపడడం చూసి ఇంత వరకు అలాంటి ఆపరేషన్ గేదెలకు జరుగలేదని,దానికి కావాల్సిన ఆపరేషన్ పనిముట్లు కూడా లేవని చెబుతూ,సరే ప్రయత్నం చేసి చూద్దాం అని రైతుకి భరోసా ఇచ్చారు.అనంతరం ఈ ఆపరేషన్ ని ఛాలెంగింగ్ గా తీసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్,స్థానిక అర్హోపెడిక్ సర్జన్ డా, చంద్రమోహన్,డెంటిస్ట్ డా,నాగుబండి శ్రీనివాసరావులను సంప్రదించి సాధ్యాసాధ్యాలను చర్చించి కావాల్సిన వైరింగ్ మెటిరియల్ ఆర్థోపెడిక్ ఆసుపత్రి ద్వారా డ్రిల్లింగ్ మెషిన్ స్థానిక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ద్వారా తెప్పించి విరిగిపోయిన దవడ ఎముకకి డ్రిల్లింగ్ చేసి స్టెయిన్లెస్ స్టీల్ వైర్ తో దవడ ఎముకకి పంటి పలుకకి కుట్లు వేసి,మత్తుద్వారా గేదె ఏడునెలల సూడి కి నష్టం జరుగకుండా విజయవంతంగా కింది పెదవి ఎముకను,దంతాలను అతికించడం జరిగింది.ఆపరేషన్ తరువాత గేదె స్వతహాగా నీరు తాగడం తో మూడురోజులకు తన గేదె ఆహారం తీసుకోవడం తో రైతు ఆనందానికి అవధులు లేవు.సాధ్యమే కాదనుకున్న ఆపరేషన్ సాకారమైన వేళ,చేతికి అందదు అనుకున్న గేదె తిరిగి తనకళ్ళ ముందే రిపేరైన దవడ దంతాలతో ఆరోగ్యంగా కనిపించడంతో వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇలాంటి ఆపరేషన్ పశువుల్లో మన ఉమ్మడి జిల్లాలో ఇదే మొదటి సారి అని రాష్ట్రం లో సైతం ఇదివరకు జరిగినట్లు లేవని,ఈ సక్సెస్ తో మునుముందు పశువుల్లో సైతం ఆర్థోపెడిక్,దంత సంబంధిత ఆపరేషన్ లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి పశుపోషకులకు మరింత మెరుగైన శస్త్ర చికిత్సలతో చేయూత నిస్తామని అసిస్టెంట్ డైరెక్టర్ డా, పి పెంటయ్య తెలిపారు.ఆపరేషన్ లో కాపుగల్లు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా సురేంద్ర,సిబ్బంది రాజు,చంద్రకళ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.