కోదాడ,జులై 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మున్సిపల్ పరిధిలోని అనంతగిరి రోడ్డులో గల పెద్ద చెరువు అలుగు బ్రిడ్జిని నిర్మించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలం చెందారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాల్వర్టుగా ఉన్న అలుగును తీసేసి బ్రిడ్జి నిర్మించాలని అలా నిర్మించినట్లయితే వర్షాలు వచ్చినప్పుడు రాకపోకలకు అంతరాయం లేకుండా ఉంటారని పలువురు అన్నారు. ఈ మధ్యకాలంలోనే నూతనంగా రోడ్డు పోసినారు కనీసం ఆ కాల వద్దు చాలా ప్రమాదకరంగా ఉన్నది అని వారికి తెలిసిన ఇరుపక్కల రైలింగ్ ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారు. వాహనదారులు భయపడుతూ వాహనాలు నడుపుతున్నామని అన్నారు. అంతే కాకుండా అసెంబ్లీ సమావేశాలలో స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పెద్ద చెరువు అలుగు గురించి ప్రస్తావించిన ఇంతవరకు నిర్మించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం పలువురు వాపోతున్నారు. అంతేకాకుండా అనంతగిరి నుంచి వచ్చేటప్పుడు మున్సిపల్ పరిధి నుండి కిట్స్ కళాశాల వరకు ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు రోడ్డు దిగాలంటే వాహనదారులు భయాందోళనకు గురి అవుతున్నారు కనీసం రోడ్డు కు మార్జిన్ లేకపోవడం ఇబ్బందికరంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.అసలే గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపైకి నీరు రావడంతో అనంతగిరి నుంచి కోదాడకు రాకపోకలు నిలిచిపోయాయి.రాకపోకలు నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే బ్రిడ్జి నూతన నిర్మాణం చేపట్టి ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రమాదకరంగా పెద్ద చెరువు అలుగు బ్రిడ్జి:వాహనదారులు ఎదురుంగా వాహనాలు వచ్చినప్పుడు రోడ్డు దిగాలంటే భయపడుతున్నారు
RELATED ARTICLES