కోదాడ,జులై 10(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని తోగ ర్రాయి,కూచిపూడి గ్రామాలలో ప్రమాదపు అంచులలో ట్రాన్స్ఫార్మర్స్ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న నిమ్మకు నీరు ఎత్తినట్లు వివరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.తోగర్రాయి గ్రామంలోని రెడ్డి బజార్లో బండపై ట్రాన్స్ఫార్మర్ పెట్టి కాలం వెల్లదీస్తున్న సంబంధిత అధికారులు అంతేకాకుండా చిన్నపిల్లలు పట్టుకుంటే అందుతాయి గత సంవత్సరం నుండి లో వోల్టేజీతో చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని ప్రజలు వాపోతున్నారు. వర్షం పడితే కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.కూచిపూడి గ్రామంలో రోడ్డుకు అడ్డంగా రాకపోకలు లేకుండా ట్రాన్స్ఫార్మర్ ని ఏర్పాటు చేసినారు.అంతేకాకుండా పట్టుకుంటే చేతికి అందే విధంగా ఉన్నవి అని ప్రజలు వాపోతున్నారు ఆ రోడ్డు లో నడవాలంటే బిక్కుబిక్కుమంటూ నడుస్తున్నామని ప్రజలు వాపోతున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే ట్రాన్స్ఫార్మర్లు మార్చి లోవల్టీ సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు వాపోతున్నారు.
ప్రమాదపు అంచులలో గ్రామాల ట్రాన్స్ఫార్మర్స్: ప్రజలు,గ్రామ ప్రథమ పౌరులు ఎంత విన్నవించుకునా పట్టించుకోని అధికారులు: సంవత్సరాల తరబడి బిక్కుబిక్కుమంటు జీవనం సాగిస్తున్న గ్రామ ప్రజలు
RELATED ARTICLES