కోదాడ,జులై 04 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ జాతీయ అవార్డు గ్రహీత బొమ్మల వెంకన్నను భారత రాష్ట్ర సమితి కోదాడ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి గ బొమ్మల వెంకన్న ఆఫీస్ కి వెళ్లి పరామర్శించి, తన ఆరోగ్య విషయాలను తెలుసుకుని ముచ్చటించారు.అనంతరం వివిధ దేశాలలో జరిగిన ఫోటో ఎగ్జిబిషన్లోల్లో పాల్గొన్న బొమ్మల వెంకన్నని అభినందించారు.భారతదేశ ఖ్యాతిని వివిధ దేశాలకు వ్యాప్తింపజేసిన కోదాడ వాసిగా బొమ్మల వెంకన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట భారత రాష్ట్ర సమితి నాయకులు రాయపూడి వెంకట నారాయణ,అనంతగిరి జడ్పిటిసి కొణతం ఉమా శ్రీనివాస్ రెడ్డి,చిలుకూరు జడ్పిటిసి బోలిశెట్టి శిరీష నాగేంద్రబాబు,కెఎస్ఆర్ యువసేన నాయకులు దున్న ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ ఫోటోగ్రాఫర్ జాతీయ అవార్డు గ్రహీత బొమ్మల వెంకన్నను ఫర్మర్శించిన కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి
RELATED ARTICLES