Sunday, December 28, 2025
[t4b-ticker]

ప్రశ్నించే గొంతుక ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలి

ప్రశ్నించే గొంతుక ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలి

:నిరుద్యోగులకు పక్షాన పోరాటం చేస్తా

:మార్నింగ్ వాకర్ తో కలిసి వాకింగ్ చేసిన ప్రేమేందర్ రెడ్డి

:బాయ్స్ హై స్కూల్ లో ప్లేయర్స్ తో ముచ్చటిచి మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేయాలని కోరిన ప్రేమేందర్ రెడ్డి

కోదాడ,మే 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: స్థానిక బైపాస్ గ్రౌండ్ లో మార్నింగ్ వాకర్స్ తో కలిసి వాకింగ్ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి శాసనమండలి సభకు పంపించినట్లయితే పట్టబద్ధుల తరఫున ప్రశ్నించే గొంతుక అవుతానని బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు.బుధవారం పట్టణంలోని బైపాస్ గ్రౌండ్,బాయ్స్ హై స్కూల్ లో మార్నింగ్ వాకర్స్ తో ప్లేయర్స్ తో కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసినట్లయితే మీ పక్షాన పోరాడుతానని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్,బిఆర్ఎస్ అభ్యర్థులను నమ్మే పరిస్థితి లేదని అన్నారు.ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థి పరిస్థితి అందరికీ తెలిసినదే రెండో వ్యక్తి బిఆర్ఎస్ అభ్యర్థి తను ఎవరికి పరిచయం లేని వ్యక్తి అలాంటి వారికి ఓటేస్తే మీ పక్షాన వారు పోరాడరని అన్నారు. మీరు నన్ను గెలిపించినట్లయితే మీ పక్షాన నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి,బిజేపి రాష్ట్ర నాయకులు డా,, ఎం అంజి యాదవ్,అక్కిరాజు యశ్వంత్ బోలిశెట్టీ కృష్ణయ్య,నూనె సులోచన, వంగవీటి శ్రీనివాసరావు,సాతులూరి హనుమంతరావు,ఓరుగంటి కిట్టు,కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular