ప్రాంతీయపశు వైద్యశాలను సందర్శించిన:డా,,సుబ్బరాయుడు
Mbmtelugunews//ఈకోదాడ,ఆగష్టు 11 ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణం ప్రాంతీయపశు వైద్యశాలను తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ డా సుబ్బరాయుడు సందర్శించినారు.సాదరంగా స్వాగతం పలికిన అసిస్టెంట్ డైరెక్టర్ డా,,పి పెంటయ్య.పశువుల్లో కృత్రిమధారణకు (సెక్స్ సార్టెడ్ సెమెన్) ఆడదూడలకు మాత్రమే జన్మనిచ్చే పశువుల వీర్య నాళికలు వాడకం పై పశుపోషకులకు విస్తృత అవగాహన కల్పించాలని.తద్వారా మగ దూడల సంతానం తగ్గి పశుపోషకులకు మంద అభివృద్ధి చెందే ఆడదూడలు మాత్రమే పుడతాయని,మగదూడల పోషణ భారం తగ్గి లేగ దూడలతో,మరింత లాభసాటిగా పశుపోషణ ఉంటుందని స్థానిక అసిస్టెంట్ డైరెక్టర్ కి సూచించారు.అనంతరం ప్రాంతీయ పశువైద్యశాలలో మొక్క నాటారు.ఈ కార్యక్రమములో తమ్మారం పశువైద్యాధికారి డా,, రమేష్ నాయక్,సిబ్బంది రాజు,సాగర్ తదితరులు పాల్గొన్నారు.