Tuesday, December 24, 2024
[t4b-ticker]

ప్రాంతీయ పశువైద్యశాల కోదాడలో నేటి నుండి పశువులకి ఉచిత కృత్రిమ గర్భధారణ సేవలు-డా,,పి.పెంటయ్య,అసిస్టెంట్ డైరెక్టర్

- Advertisment -spot_img

ప్రాంతీయ పశువైద్యశాల కోదాడలో నేటి నుండి పశువులకి ఉచిత కృత్రిమ గర్భధారణ సేవలు-డా,,పి.పెంటయ్య,అసిస్టెంట్ డైరెక్టర్

కోదాడ,సెప్టెంబర్ 14(మనం న్యూస్):పశువుల్లో దేశవ్యాపతంగా 11౩ జిల్లాల్లో ఉచిత కృత్రిమ గర్భధారణ కార్యక్రమం
రెండవ విడత పథకం తిరిగి ప్రారంభం.మన జిల్లాలో 100 గ్రామాల్లోని 50 వేల పశువులకి ఉచిత గర్భధారణ అవకాశం
రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఒక మహత్తర కార్యక్రమం దేశవ్యాప్త కృత్రిమ గర్భధారణ కార్యక్రమం.ఉన్న పశువుల్ని సూడి మోయించి,జనావళికి సమృద్దిగా పాలు అందించడానికి,అమలు చేస్తున్న ఈ పథకం పశు పోషకులకు ఒక వరం.పశుపోషకుల ముఖ్య సమస్య పశువులు సకాలంలో సూడి మోయకపోవడం.సాధారణంగా పశువు ఈనిన ౩ మాసాల లోపు తిరిగి సూడిమోసినట్లైతేనే పశుపోషకులకి పాడి లాభసాటిగా ఉంటుంది.మెరుగైన లాభాలకి దొడ్డిలో ఉంటే పాడిపశువైనా ఉండాలి లేదా సూడిదై ఉండాలి,కానీ వట్టిపోయిన పశువులు ఉండరాదు.ప్రస్తుత పరిస్థితుల్లో పశుపోషణ అత్యంత భారంతో కూడుకున్న నేపద్యంలో పాడిలేని పశువుల్ని మేపడం మరింత భారంగా మారి మేపుకోలేక కొన్ని ప్రాంతాల్లో వాటిని అడ్డికి పావుశేరు చొప్పున కభేలాలకి తరలించడం కూడా జరుతుంది.ఈ సమస్యను అధిగమించడానికి పశుపోషకులు తమదొడ్డిలో ఈనిన ప్రతి పశువు తిరిగి మూడు మాసాల లోపులో సూడిమోసేలా చూసుకోవాలి . తద్వారా ప్రతి గేదె ఈతలో 10 నెలల పాటు పాడిలో రెండు నెలలు ఖాళీగా ఉండడం ద్వారా పశుపోషకులకి మంచి లాభసాటిగా ఉంటుంది.ప్రజలకి నిరంతరం ఆరోగ్యకరమైన పాలు అందుబాటులో ఉంటాయి.శాస్త్రీయంగా పశుసంపదలో సంవత్సరానికి 70 శాతం పునరుత్పతి అయ్యేలా(సూడి మోసి దూడలు పుట్టేలా )లక్ష్య సాధనతో నూటికి 50% కంటే తక్కువ పశువుల్లో కృత్రిమ గర్భధారణ జరుగుతున్న జిల్లాలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది.ఈ కార్యక్రమము ద్వారా దేశవాళి/స్థానిక పశు జాతిని అధిక పాలదిగుబడిని ఇచ్చే మేలు జాతి పాడి పశువులుగా వృద్ది చేసి సమృద్దిగా పాలదిగుబడులు పెంచడం ద్వారా ప్రజారోగ్యం కూడా కాపాడబడుతుంది.జిల్లాలో ఎంపిక చేసిన పశువైద్యశాలల్లో అందుబాటులో ఉన్న ఈ సౌకర్యంతో పశుపోషకుల ఇంటి ముంగిట వారి పశువుల జాతి అభివ్రుద్దికి ఉచితంగా క్రుత్రిమ గర్భదారణ చేయబడును.ఈ పథకం వినియోగించుకోవడానికి పశుపోషకుల పశువుల చెవులకి పన్నెండు అంకెలు గల గుర్తింపు సంఖ్య చేవిపోగులు ఉండాలి,అవి భారత్ పశుదాన్ పోర్టల్ లో అప్లోడ్ చేసి ఉండాలి.చేవిపోగులు వేయించుకొని వారు ఇదివరలో వేసినవి ఊడిపోయిన వారు తిరిగి చేవిపోగులు వేయించి గేదె ఫోటో తో సహా భారత్ పశుదాన్ పోర్టల్ లో అప్లోడ్ చేయించాలి.రైతులు తమ పశువులు ఎదకు వచ్చినప్పుడు దగ్గరలోని పశువైద్య అధికారిని/సిబ్బందిని సంప్రదిస్తే వారి ఇంటి వద్దకే కృత్రిమ గర్భధారణ టేక్నిషియన్ ని పంపించి పశువులకి కృత్రిమ గర్భధారణ చేయబడును. కృత్రిమ గర్భధారణ చేసిన పశువుల వివరములు, రైతు అదార్ తో సహా,కృత్రిమ గర్భధారణ తేది,సూడి పరీక్ష తేది,దూడ పుట్టిన తేది ఫొటోలతో సహా “భారత్ పశుదాన్ పోర్టల్ “లో అప్లోడ్ చేయాలి.కృత్రిమ గర్భధారణ చేసిన పశువుల సూడి నిలవడం, దూడ పుట్టడం జాతీయ స్థాయిలో అంతర్జాలం ద్వారా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మెరుగైన కృత్రిమ గర్భధారణతో పనిచేసే సిబ్బందిని ప్రోత్సహించడానికి,పశువుల్లో నిలిచిన సూడికి.పుట్టిన దూడల సంఖ్యను బట్టి ప్రోత్సాహకాలు సైతం అందించడం జరుగుతుంది.నేటి నుండి పది నెలల పాటు అందుబాటులో ఉన్న ఈ ఉచిత కృత్రిమ గర్భాదారణ సదాహవకాశాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకొని తమ పశువులు సకాలంలో దూడలు పొంది నిరంతర పాడితో మంచి లాభాలు పొందాలని సూచించనైనది.ఈ కార్యక్రమములో సిబ్బంది ప్రశాంత్,చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular