కోదాడ,జులై 19(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణం నందు గల తిరుమల హాస్పిటల్ మేనేజ్ మెంట్ డాక్టర్ కాకుమాను ప్రమీల శ్రీపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఆసన,ప్రాణామాయ,ధ్యాన,శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ముఖ్యముగా గర్భిణీ మహిళలకు సాధారణ ప్రసవం జరుగుటకు ఎంతగానో ఈ ఆసనాలు తోడ్పడుతాయని అలాగే మానసిక శారీరక దృఢత్వం తో పాటు ఆరోగ్యవంతమైన శిశువులు భావితరానికి అందించేందుకు కావాల్సిన యోగాసనాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

రక్తహీనత నివారణకు తోడ్పడే ప్రాణాయామం అలాగే బీపీ హైబీపీ నివారణకు మానసిక ఒత్తిడి అరికట్టి మానసిక ప్రశాంతత చేకూర్చుటకు ఈసాధన తోడ్పడుతుంది అని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమీల శ్రీపతి రెడ్డి,డాక్టర్ సందీప్ లక్ష్మి,డాక్టర్ విజయలక్ష్మి,స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ సభ్యులు,డాక్టర్ పి విమలాదేవి,డాక్టర్ రామారావు,జిఎం నరసయ్య,యోగా ఇన్స్పెక్టర్ ఎస్ వాసు, గర్భిణీలు,హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు