◾ *|| ప్రాణాలు తీస్తున్న ప్రైవేట్ స్కూల్స్ ||* ◾
*▪️ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమా …❓*
*▪️ఎదురుగా వస్తున్న కారు నిర్లక్ష్యమా.*
*▪️శ్రీ చైతన్య స్కూల్ పిల్లల ఆటో బోల్తా…❓*
▪️mbmtelugunews//బాపట్ల, ఆగష్టు 08 ప్రతినిధి మాతంగి సురేష్:బాపట్ల మున్నవారిపాలెం గ్రామానికి చెందిన విద్యార్థిని విద్యార్థులు బుధవారం ఆటోలో శ్రీ చైతన్య స్కూల్ కి వస్తున్న క్రమంలో సూర్యలంక రోడ్డు అగ్రికల్చర్ కాలేజ్ ఏటీఎం ఎదురుగా స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా పడిన సంఘర్షణ చోటు చేసుకుంటుంది.
▪️ఆటో అధిక స్పీడ్ ఆ ఓవర్ లోడా వివరాలు తెలియాలి,ఆటో వెళ్తున్న క్రమంలో కారు స్పీడ్ గా ఆటో కి ఎదురు రావడంతో సడన్ బ్రేక్ వేయడం తో ఒక్కసారిగా బోల్తా కొట్టిందని ఆటో డ్రైవర్ తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఆటో కింద ఒక బాలుడు పడడం కాలు చేయి ప్యాక్చర్ అయ్యింది.
▪️ఆటోలో ప్రయాణిస్తున్న వారికి చిన్న చిన్న గాయాలయ్యాయి, ఆటో డ్రైవర్ గాయపడిన వారిని స్కూలుకి తీసుకువెళ్లాల హాస్పిటల్ కి తీసుకువెళ్లాల తెలియక సతమతమయ్యి తల్లిదండ్రులకు సమాచారం అందించి వచ్చేదాకా వెయిట్ చేసి గాయపడిన వారిని ఆటోలోనే హాస్పటల్ తరలించారు..
▪️ఆటోలో ఎంతమంది పిల్లలు ప్రయాణించాలి …❓
▪️ఎంతమంది ప్రయాణిస్తున్నారు.
▪️ఈరోజు జరిగిన ప్రమాదం వల్ల ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది.
▪️ఏదైనా జరిగితే ఊహించటమే కష్టమైన పరిస్థితి.
▪️మోటార్ ఇన్స్పెక్టర్లు ఎన్నిసార్లు కార్యక్రమాలు చేసి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న గాని ఎందుకు వాహనదారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు …❓
▪️కొంచెం అయినా కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా ప్రజానికం.
▪️సూర్యలంక రోడ్లో ఎన్నో కాలేజీలు స్కూల్స్ ఉన్నప్పటికీ పోలీసు వారు వాహనదారులకు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు.
▪️ఈరోజు జరిగినటువంటి ఆటో ప్రమాదనికి బాధ్యులు ఎవరు.
▪️ఇప్పటికైనా అధికారులు చొరవ చేసుకొని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
▪️స్కూలు యాజమాన్యం పిల్లల యూనిఫాంలో మీద ఫీజుల మీద
ర్యాంకులు మీద పెట్టే శ్రద్ధ.
▪️విద్యార్థుల రాకపోకల మీద కూడా పెడితే ఇటువంటి ప్రమాదాలు జరగవు అని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.