ప్రాణి ఎదైనా ప్రాణమే అంటూ ప్రాంతీయ పశువైద్యశాల లో వైద్యం
:కోదాడలో నడుం విరిగిన పిల్లి కూనకి కృత్రిమ నడక ఏర్పాటు.
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 10(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ పట్టణం లోని ఒక భోజన హోటల్ లో పిల్లి కూన వీపుపై వస్తువు పడి నడుం విరిగి నడవలేక వెనుక కాళ్లను ఈడుస్తూ ఉన్న పిల్లిపిల్ల దీనావస్థను చూడలేక ఆ హోటల్ యజమాని వైద్యం కోసం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల కు తీసుకురాగా అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య పిల్లి పిల్లను పరీక్షించి వెన్నెముక దెబ్బతిని వెనుక కాళ్ళు చచ్చుపడిపోయాయని,చిన్న వయస్సే కాబట్టి వైద్యం చేస్తే భవిష్యత్ లో కాళ్లకి పటుత్వం వచ్చి నడిచే అవకాశం ఉందని చెప్పి,అది ప్రస్తుతం ఈడుస్తున్న వెనుకకాళ్ళు నేలకు రాసుకొని పుండ్లు పడకుండా ఇబ్బంది లేకుండా నడవడానికి బొమ్మలషాప్ లోనుండి పిల్లి ఎత్తులో గల రెండు చక్రాలు గల ట్రాలీ బొమ్మను తెప్పించి,పిల్లి పొట్ట కాళ్ళకి బొమ్మ ఒరుసుకోకుండా స్పాంజ్ బెడ్ ఏర్పాటు చేసి వెనుక కాళ్ళకు సపోర్ట్ గా బొమ్మ చక్రాలను అమర్చారు.

చక్రాల బొమ్మ అమర్చాక ముందు కాళ్ల సపోర్ట్ తో పిల్లి పిల్ల అలవోకగా నడవడం చూసి చూపరులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.చక్రాల బొమ్మ సహాయంతో పిల్లి పిల్ల నడక ను రెండురోజులు పరీక్షించి ప్లాస్టిక్ పైపులతో చక్రాల బండిని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తానని సూచించారు.వైద్యకార్యక్రమలో సిబ్బంది రాజు,రిక్షిత్ తదితరులు పాల్గొన్నారు.