భిహార్ రాష్ట్రం (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు): మనం చేసే పనుల వల్ల తోటివారు ఇబ్బంది పడకూడదనుకుంటాం. ఏదైనా అసౌకర్యం కలిగినా వెంటనే క్షమాపణలు చెప్పి పొరపాటును గ్రహిస్తాం. కానీ ఓ అమ్మాయి.. తన ప్రియుడితో ఏకాంతంగా గడపడానికి.. ఏకంగా ఓ ఊరునే గంటలపాటు అంధకారంలో ఉంచింది. ఇలా ఒకటో, రెండో రోజులు కాదు… నెలల పాటు. రోజూ రాత్రివేళ ఒకే సమయంలో ఆ ఊళ్లో కరెంట్ పోయేది. అయితే గ్రామస్తులు కొన్నాళ్లు పవర్ కట్ ప్రాబ్లెం అయుంటుందని అనుకున్నారు. ఇక ఆ టైంలో కరెంట్ పోతుందని తెలిసి దొంగలు కూడా రెచ్చిపోయారు. బైక్‌లు, మేకలు.. ఇలాంటివన్నీ అపహరణకు గురయ్యేవి. కానీ అసలు సంగతి తెలియగానే కోపంతో అందుకు కారణమైన వాళ్లని పట్టుకొని చితకబాదారు.మనం చేసే పనుల వల్ల తోటివారు ఇబ్బంది పడకూడదనుకుంటాం. ఏదైనా అసౌకర్యం కలిగినా వెంటనే క్షమాపణలు చెప్పి పొరపాటును గ్రహిస్తాం. కానీ ఓ అమ్మాయి.. తన ప్రియుడితో ఏకాంతంగా గడపడానికి.. ఏకంగా ఓ ఊరునే గంటలపాటు అంధకారంలో ఉంచింది. ఇలా ఒకటో, రెండో రోజులు కాదు… నెలల పాటు. రోజూ రాత్రివేళ ఒకే సమయంలో ఆ ఊళ్లో కరెంట్ పోయేది. అయితే గ్రామస్తులు కొన్నాళ్లు పవర్ కట్ ప్రాబ్లెం అయుంటుందని అనుకున్నారు. ఇక ఆ టైంలో కరెంట్ పోతుందని తెలిసి దొంగలు కూడా రెచ్చిపోయారు. బైక్‌లు, మేకలు.. ఇలాంటివన్నీ అపహరణకు గురయ్యేవి. కానీ అసలు సంగతి తెలియగానే కోపంతో అందుకు కారణమైన వాళ్లని పట్టుకొని చితకబాదారు.అయితే రోజూ రాత్రి వేళ ఒకే సమయంలో కరెంట్ పోవడంతో స్థానికులు విసిగెత్తిపోయారు. అసలు కరెంట్ ఎందుకు పోతుంది అన్న కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే ఓ రోజు ఆ యువతి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పవర్ కట్ చేయడాన్ని స్థానికులు గమనించారు. ఆ తర్వాత ఏం చేయబోతున్నదో గుర్తించి ఆమెను, ఆమెతో పాటు ఆ ప్రియుడ్ని కూడా పట్టుకుని చితకబాదారు. ప్రతిరోజూ గ్రామంలో కరెంట్ పోవడం దొంగతనాలు కూడా జరుగుతున్నాయని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రెండు బైక్‌లు, చాలా వరకు మేకలు అపహరణకు గురయ్యాయని వాపోయారు. అలాగే ఆ ప్రేమికుల కథ అందరికి తెలిసిపోయింది. చివరికి పోలీసుల సమక్షంలో ఇరువురి కుటుంబ సభ్యులు వారి పెళ్లికి కూడా అంగీకరించంతో ఈ ప్రేమ కథ సుఖాంతమయ్యింది. అయితే రోజూ రాత్రి వేళ ఒకే సమయంలో కరెంట్ పోవడంతో స్థానికులు విసిగెత్తిపోయారు. అసలు కరెంట్ ఎందుకు పోతుంది అన్న కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే ఓ రోజు ఆ యువతి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పవర్ కట్ చేయడాన్ని స్థానికులు గమనించారు. ఆ తర్వాత ఏం చేయబోతున్నదో గుర్తించి ఆమెను, ఆమెతో పాటు ఆ ప్రియుడ్ని కూడా పట్టుకుని చితకబాదారు. ప్రతిరోజూ గ్రామంలో కరెంట్ పోవడం దొంగతనాలు కూడా జరుగుతున్నాయని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రెండు బైక్‌లు, చాలా వరకు మేకలు అపహరణకు గురయ్యాయని వాపోయారు. అలాగే ఆ ప్రేమికుల కథ అందరికి తెలిసిపోయింది. చివరికి పోలీసుల సమక్షంలో ఇరువురి కుటుంబ సభ్యులు వారి పెళ్లికి కూడా అంగీకరించంతో ఈ ప్రేమ కథ సుఖాంతమయ్యింది.
ప్రియున్ని కలవాలంటే కరెంటు బందు చేయాలి..నేనే బందు చేసుకుంటాను..ఒక గంట చాలు..
RELATED ARTICLES