:అనుమతి లేని ల్యాబ్, ఫిజియోథెరపీ,ఎక్సరే మూసివేత….
:రెన్యువల్ చేయని వసంతి ఆర్థోపెడిక్ ఆసుపత్రికి రెండు రోజుల గడువు….
:సిజీరియన్ శాతం ఎక్కువగా ఉన్న ఆసుపత్రుల కు నోటీసులు…
కోదాడ,మార్చి 23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీ డాక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలని లేనిపక్షంలో ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ కోటాచలం హెచ్చరించారు. శనివారం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఆకస్మిక తనికి నిర్వహించారు.రెన్యువల్ చేయని వసంతి ఆర్థోపెడిక్ ఆసుపత్రికి రెండు రోజుల గడువు ఇచ్చినారు. ఆసుపత్రిలోని అనుమతి లేని లాబ్, ఫిజియోథెరపీ, ఎక్స్ రే ల్యాబ్ లను సీజ్ చేశారు. ఆసుపత్రిలోని అర్హత లేని సిబ్బందిని ఏర్పాటు చేశారని తక్షణమే అందరిని తొలగించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ప్రతి ల్యాబ్ కు సంబంధించి క్వాలిఫైడ్ టెక్నీషియన్లు ఉండాలని సూచించారు.

ఆస్పత్రిలో నిర్వహిస్తున్న మెడికల్ దుకాణాలలో ఫార్మసిస్టును ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా సిజీరియన్ శాతం ఎక్కువగా ఉన్న జిల్లాలోని 11 ప్రైవేట్ ఆసుపత్రుల కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వసంతి ఆర్థోపెడిక్ కేర్ హాస్పటల్ డిసెంబర్ 30, 2022 హాస్పటల్కు పర్మిషన్ అయిపోయిందని హాస్పటల్ పర్మిషన్ తీసుకోవాలని రెండు సార్లు నోటీసులు జారీ చేసిన పట్టించుకోలేదని తెలిపారు. రెండు మూడు రోజుల్లో పర్మిషన్ తీసుకోపోతే హాస్పిటల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.కోదాడలో పలు ప్రైవేట్ వైద్యశాలలను,ల్యాబ్, స్కానింగ్ సెంటర్ లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కానింగ్ సెంటర్ ల లో లింగ నిర్ధారణ పరీక్షలు,అబార్షన్ లు చేస్తే కఠిన చర్యలుతీసుకుంటామన్నారు. స్కానింగ్ సెంటర్ ల్లో గర్భిణీల పరీక్ష నివేదికలను పరిశీలించారు.నర్సింగ్ హోమ్ లలో కాన్పులు అయినా మహిళల వివరాలను పరిశీలించామన్నారు.జిల్లా వైద్య శాఖ కార్యాలయానికి కాన్పుల వివరాలు పరీక్షల వివరాలను వసూలు చేస్తున్న బిల్లులను పరిశీలించామన్నారు.ఫిజియోథెరపీ కేంద్రం పక్కన ల్యాబ్ ను సీజ్ చేశామని ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే తిరిగి అనుమతులు ఇస్తామని తెలిపారు.ఎక్కువ సంఖ్యలో సిజేరియన్లు జరిగితే ఆ వైద్యశాలలపై తర్వాత చేస్తామన్నారు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ తనిఖీలలో డిప్యూటీ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ నిరంజన్, ఎస్ఓ వీరయ్య,వెంకటరమణ, డెమో అంజయ్య,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



