ప్రొటెస్టెంట్ క్రిస్టియన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
:యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ కోదాడ అధ్యక్షులు యేసయ్య.
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 29(ప్రతినిధి మాతంగి సురేష్): తెలంగాణ రాష్ట్రంలో ప్రొటెస్టెంట్ క్రిస్టియన్లకు సంబంధించిన సమస్యలను సీఎం రేవంత్ రెడ్డితో ప్రస్తావించి వాటి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కోదాడ నియోజకవర్గ క్రిస్టియన్ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ స్పందించి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ప్రొటెస్టెంట్ క్రిష్టియన్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటూ వస్తున్నారని వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె అన్నారు. ముఖ్యంగా నామినేటర్ పదవుల కేటాయింపులో అధిక ప్రాధాన్యత ప్రొటెస్టెంట్ క్రైస్తవులకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.కాగా క్రిస్టియన్ ప్రొటెస్టెంట్ వర్గానికి చెందిన రాష్ట్ర తెలంగాణ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్స్ అసోసియేషన్ నాయకులు గోనే సాల్మన్ రాజ్ కు ప్రభుత్వ నామినేట్ చైర్మన్ పోస్ట్ అదేవిధంగా వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఇతర పదవుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గోనే సాల్మన్ రాజ్ 1983 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నేడు అనేక హోదాలలో పనిచేశారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెందిన పాస్టర్లు క్రిస్టియన్ సంస్థల నాయకులు గోనే సాల్మన్ రాజు కు నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరుతున్నాం. కోదాడ నియోజకవర్గం యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు యేసయ్య మాట్లాడుతూ గోనె సాల్మన్ రాజ్ నాయకత్వాన్ని రాష్ట్ర క్రైస్తవ నాయకులు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యురాలు వంటెపాక జానకి- యేసయ్య, నియోజకవర్గం అసోసియేషన్ కోఆర్డినేటర్ సుందర్ రావు, నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ రాజేష్, కోదాడ పట్టణ అధ్యక్షులు ప్రభుదాస్, నడిగూడెం మండల అధ్యక్షులు ఏసురత్నం, ఇతర అసోసియేషన్ నాయకులు పాల్గొని మాట్లాడారు.



