ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం..
:పీఎం శ్రీ జడ్పీ పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహణ…..
:విద్యార్థి దశ నుండే పని అనుభవం, పరిసరాల పరిశుభ్రత అవగాహన…
:కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 19(ప్రతినిధి మాతంగి సురేష్):శనివారం నాడు కోదాడ పట్టణంలోని పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల యందు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం,పర్యావరణాన్ని కాపాడుదాం,స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించినారు.కోదాడ మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి. సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడినారు.విద్యార్థులు ఉపాధ్యాయులు సమిష్టి కృషితో పాఠశాల ఆవరణ పరిశుభ్రత కోసం కృషి చేయడం, పాఠశాల ఆవరణలో మెడికల్ ప్లాంట్స్,ఫ్లవర్ ప్లాంట్స్,ఆకుకూరలు కూరగాయల కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి సంరక్షణ చేయడం,ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం పర్యావరణాన్ని కాపాడదామని స్వచ్ఛభారత్ కార్యక్రమాలు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.ఇలాంటి కార్యక్రమాలు వలన విద్యార్థి దశ నుండే పని అనుభవం,శ్రమ పట్ల గౌరవభావం,అవగాహన ఏర్పడతాయని తెలిపినారు.పాఠశాలలోని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్,రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తహ్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రీన్ షర్టులు,క్యాప్ లు ధరించి పాఠశాల ఆవరణలో ఉన్న మొక్కలు,నీటి సరఫరా సంరక్షణ పద్ధతులను,పరిసరాల పరిశుభ్రత విషయాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ,జిల్లా సైన్స్ అధికారి ఎల్ దేవరాజు,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.