కోదాడ,ఏప్రిల్ 17(mbmelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బుధవారం పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సీసీఆర్ విద్యా నిలయం నందు పునీత అన్నమ్మ వేద బోధక సభ సంస్థాపకులు దైవ సేవకులు సిల్వియో పాస్కాలి శత వర్ధంతి వేడుకలు పాఠశాల హెడ్మాస్టర్ సిస్టర్ ఆన్ జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా కాల్జినల్ పూల ఆంథోని,బిషప్ సగిలి ప్రకాష్ పాల్గొని బలిపూజను సమర్పించారు.

ఈ కార్యక్రమానికి సెయింట్ ఆన్స్ మదర్ జనరల్ జపమాల వట్టి,అసిస్టెంట్ మదర్ జనరల్ సిస్టర్ అల్ఫోన్స్ ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించబడ్డారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్కాలి చేసిన సేవను పేదల ఎడల ఆయన చూపిన ప్రేమ వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో సిల్వియో పాస్కాలి చేసిన సేవను డాక్యుమెంటరీ సినిమా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఫాదర్ సిల్వియో పాస్కారి సేవను కీర్తిస్తూ సెయింట్ జోసఫ్ సిసిరెడ్డి విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది.

పాస్కాలి మఠాన్ని స్థాపించడంలో ఆయన చేసిన కృషి త్యాగం భక్తి విశ్వాసం గురించి ఎంతో వివరించారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ ఆన్ జ్యోతి,పాఠశాల ఉపాధ్యాయులు, 100 మంది గురువులు,200 మంది సిస్టర్లు తదితరులు పాల్గొన్నారు



