ఫోటోగ్రఫీ రంగానికి రవి చేసిన సేవలు చిరస్మరణీయం………
కోదాడ,ఏప్రిల్ 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ గుండు రవి శుక్రవారం ఖమ్మం జిల్లా ముదిగొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శనివారం కోదాడలోని వారి నివాసానికి తీసుకువచ్చారు.కాగా విషయం తెలుసుకున్న తోటి ఫోటోగ్రాఫర్లు పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తూ ఫోటోగ్రాఫర్ రవి అమర్ హై అంటూ నినాదాలు చేశారు.

వృత్తి పట్ల ఎంతో గౌరవంగా నిజాయితీతో,నిబద్ధతతో పనిచేసి ఫోటోగ్రఫీ రంగానికి వన్నెతెచ్చారని ఈ సందర్భంగా వారి సేవలను స్మరించారు.అనంతరం వారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యుల రోదనలు చూసి అక్కడ ఉన్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు జెమిని నరేష్,రామకృష్ణారెడ్డి,మరికంటి లక్ష్మణ్,సప్తగిరి,బసవయ్య,శేఖర్,వర్మ, ఎస్ఎస్ శ్రీను,ఉపేందర్,దస్తగిరి,స్వామి,ప్రభాకర్,ఉప్పతల శ్రీను,నరేష్ తదితరులు పాల్గొన్నారు……



